WhatsApp Image 2025 01 31 at 14.50.21
రథ సప్తమి వేడుకలను విజయవంతం చేయాలి: MLA కందుల
త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. మార్కాపురంలో ఫిబ్రవరి 4న జరిగే రథ సప్తమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలియజేశారు. సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
మాడ వీధుల్లో స్వామి వాహనాలతో పాటు సాయంత్రం రథం తిరిగే సమయంలో పోలీస్, మున్సిపల్ మరియు విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీరితో పాటు మిగిలిన శాఖలు కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. ఆ రోజున ట్రాఫిక్ ఆంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
