జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 31 at 12.45.53

TRINETHRAM NEWS

యానిమేటర్ ఆర్పి లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్. యానిమేటర్ల పై రాజకీయ వేధింపుల ఆపాలి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు. నగరంలో యానిమేటర్లు ప్రదర్శన

Trinethram News : రాజమండ్రి జనవరి 31 : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యానిమేటర్ లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీను ముఖ్యమంత్రి,వర్యులు నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ యానిమేటర్లు ఆర్పీలు యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలుఎం శ్రీదేవి డిమాండ్ చేశారు

శుక్రవారం ఉదయం స్థానిక అంబల్ల సూర్యరావుభవన్లో యానిమేటర్స్ ఆర్ పి లు యూనియన్ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది దీనికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ,తూర్పుగోదావరి జిల్లా , కాకినాడ జిల్లా ల నుండి యానిమేటర్లు ఆర్పీలు వందలాది మంది హాజరయ్యారు
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి అధ్యక్షత వహించారు

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, చిరు ఉద్యోగులు ఔట్సోర్సింగ్ కార్మికులు అందరూ కూటమి ప్రభుత్వం హామీలను నమ్మి ఓట్లు వేశారని ఆయన అన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం చట్టం ద్వారా 26000 జీతం ఇవ్వాలని మధు డిమాండ్ చేశారు పెండింగ్లోవున్న జీతాలు ను వెంటనే మంజూరు చేయాలని మధు కోరారు కొన్ని ప్రాంతాల్లో నూతనంగా వచ్చిన కూటమి నాయకులు రాజకీయ వేధింపులు చేస్తున్నారని వాటిని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు

జిల్లా అధ్యక్షురాలు ఎం శ్రీదేవి మాట్లాడుతూ అర్బన్ లో ఉన్న సంఘాలను రూరల్ లోకి మార్చాలని ఆమె కోరారు మూడు సంవత్సరాల కాలపరిమితి 64 జీవోను రద్దు చేయాలని శ్రీదేవి డిమాండ్ చేశారు

యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఆర్ వరలక్ష్మి కె కనక మాట్లాడుతూ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అర్హతను బట్టి ప్రమోషన్స్ సిసి పోస్టులు మంజూరు చేయాలన్నారు ఎన్ ఆర్ ఎల్ ఎం ద్వారా జీతాలు సొంత అకౌంట్లో వెయ్యాలని వారు డిమాండ్ చేశారు

ఈ సమావేశం నకి ముందు మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన ప్రదర్శన కొబ్బరికాయ మార్కెట్ తాడితోట సెల్టన్ సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంది

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు నాగలక్ష్మి మనీ సిహెచ్ లలిత జి నాగజ్యోతి వీర వేణి మేడిశెట్టి లక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page