TRINETHRAM NEWS

1/70 చట్టం పై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. – జేఏసీ నాయకులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : 1/70 చట్టం పై, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, రాజేంద్ర పాలెం గిరిజన భవన్ వద్ద జరిగిన ఆదివాసి జే ఏ సి సమావేశంలో మండల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం లో ఉన్నత స్థాయి పదవిలో ఉంటూ 1/70 చట్టం పై, సడలింపు చేయాలి అని మాట్లాడం ఎవరికి మేలు చేయడానికి గిరిజనేతరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ సడలింపు అంతే కానీ టూరిజం తో ఆదివాసీలకు ఒరిగేది ఏమీ ఉండదు.ప్రధానంగా ఈ ప్రాంతంలో బాక్సైట్ అనే ఖనిజ సంపద కోసం పేరు కే టూరిజం అసలు ఉద్దేశం బాక్సైట్.

ఈ ప్రాంతం లో ఆదివాసీల జీవితాలు నాశనం అయిన పరవాలేదు కానీ, ప్రభుత్వ ఆదేశాలు నెరవేర్చాలి అంటే అసెంబ్లీ స్పీకర్ మా ఏజెన్సీ ప్రాంతం వైపు చూడొద్దు మాకు ఉద్యమాలు కొత్తకాదు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారితో పోరాడే తత్వం ఈ దేశానికే నేర్పింది ఆదివాసి లే, మా సహనం ను చేతకానితనం గా చూడొద్దు అంటూ ఆదివాసి జే ఏ సి జిల్లా నాయకులు ఎస్.అశోక్ లాల్ , నర్సి పాపారావు, అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ సూరిబాబు,పాడి లవరాజు,ఉల్లి సూరి బాబు, నర్సి కృష్ణ, కొర్రు బాబూరావు, బూమయ్య,సోమ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App