జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 30 at 20.35.37

TRINETHRAM NEWS

అరకు చలి ఉత్సవాలు తొ గిరిజనుల జీవితాలు మారవు. గ్రామాల్లో త్రాగు నీరు,రోడ్లు,విద్య, వైద్యం.మాత్రమే మారుస్తాయి. ఆదివాసి గిరిజన సంఘం.

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి 31 : ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు చిన్నబాబు మాట్లాడుతూ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అరకు చలి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు,ఇది కేవలం పర్యటకుల ఆనందం కోసం జరుగుతున్నాయి,గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే నిధులు అరకు చలి ఉత్సవాలు పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారు .
గిరిజన ప్రజా ప్రతినిధులు గిరిజన సంఘాల అభిప్రాయాలు తీసుకోలేదు ఈ అరకు చలి ఉత్సవంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా లేదు, సాంప్రదాయ ఆచారాలకు భంగం కలిగే విధంగా చలి ఉత్సవాలు నిర్వహణ జరుగుతుంది.
గిరిజన ప్రాంత అభివృద్ధి ఎక్కడ గొంగళి అక్కడే ఉన్నాయి డోలిమోతలు పెరుగుతుంది . అభివృద్ధి అంతరిక్షంలో తాకింది కానీ గిరిజనులు మలేరియా, డయేరియాలతో మరణాలు పెరుగుతున్నాయి,ప్రతి ఏటా వేసవి కాలంలో త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాము స్పందన పేరుతో గిరిజనులు అభివృద్ధికి ఎదురుచూస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. నిధులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు ఐటీడీఏ పంచవర్ష ప్రణాళిక పెట్టి నిధులు వివిధ అభివృద్ధి పనులకు కేటాయించాలి.
సమగ్ర అభివృద్ధి చేసే ఐటిడిఏ ఉపాధి రహితం వైపు అడుగులు వేస్తుంది. గిరిజన ప్రాంతంలో అనేక అటవిఉత్పత్తులు ఉన్నాయి అడ్డాకులు, చింతపండు, ఉసిరి, సికాయ వంటి అటవిఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య తీర్చవచ్చు కానీ అధికారులు ప్రభుత్వం ఇటువంటి అభివృద్ధి వైపు ఏనాడు అడుగులు వేయలేదు. ఏజెన్సీ మారుమూల గ్రామాలకు పాఠశాల భవనాలు లేక గిరి విద్యార్థిని విద్యార్థులు తమ చదువులు అనేక ఇబ్బందులతో కొనసాగిస్తున్నారు శిరగం పంచాయతీ వర్ర తోకవలస, బస్కి పంచాయితీ బోండా గుడ, సుంకరమెట్ట పంచాయతీ పిర్రిబంద మాదల పంచాయతీ దోమల జోరు, బాబు గుడ, బట్టి వలస, పాఠశాల భవనాలతో పాటు అంగన్వాడి భవనాలు సమస్యలు కూడా మండలంలో కోకోకోలాల్లో ఉన్నాయి తక్షణమే పాఠశాల భవనాలు అంగన్వాడి భవనాలు చెక్ డ్యాం లు నిర్మాణాలకు నిధులు కేటాయించి భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
మంచినీరు, రోడ్డు వ్యవసాయం ,విద్యా, వైద్యం కోసం ప్రత్యేక ప్రణాళికతో నిధులు కేటాయించి ఆదివాసి గిరిజన ప్రాంత సమగ్ర అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలని ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు గెమ్మెలి చిన్నబాబు డిమాండ్ చేశారు. ఈ ప్రకటన సందర్భంగా కొర్రా మగ్గన్న. జన్ని, భగత్రం కిండంగి రామారావు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page