రవాణా శాఖ కార్యాలయంలో కంటి పరీక్ష శిబిరం నిర్వహణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

TRINETHRAM NEWS

రవాణా శాఖ కార్యాలయంలో కంటి పరీక్ష శిబిరం నిర్వహణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి – డాక్టర్ అన్న ప్రసన్న కుమారి

పెద్దపల్లి, జనవరి -29: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయంలో కంటి పరీక్ష వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి తెలిపారు.

బుధవారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా జిల్లా వైద్యారోగశాఖ అధికారి ఆదేశాల మేరకు వైద్య అధికారులు జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు.

రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమిటీ పరీక్ష శిబిరంలో వైద్య సిబ్బంది పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో 60 మందికి సాధారణ వైద్య పరీక్షలు, 51 మందికి కంటి పరీక్షలు నిర్వహించే 39 మంది దృష్టి దోషాలను గుర్తించి కంటి అద్దాలకు సిఫార్సు చేశారు, టెరిజీయం కు మరో ఇద్దరిని సిఫార్సు చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ, ఆప్తాల్మిక్ అధికారులు అజయ్ కుమార్, సమ్మయ్య, నర్సింగ్ అధికారి షర్మిల, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top