TRINETHRAM NEWS

డేరా బాబా ర‌హీమ్‌ కు బెయిల్!

Trinethram News : Haryana : జనవరి 28
అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా అధినేత రామ్ రహీమ్‌, (డేరా బాబా)కు మరోసారి బెయిల్ వచ్చింది. దీంతో ఆయన ఈరోజు జనవరి 28న ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనను స్వాగతించేం దుకు డేరా బాబా ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు వచ్చింది.

అయితే, డేరా చీఫ్ రామ్ రహీమ్‌కు 30 రోజుల పాటు బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో అతను నేరుగా సిర్సా డేరా సచ్చా సౌదాకు చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆశ్రమంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే, డేరా బాబా 2024 అక్టోబర్‌లో బెయిల్ మీద బయటకు వచ్చారు. అప్పుడు ఆయన 20 రోజుల పాటు యూపీలోని బర్నావా ఆశ్రమంలో ఉన్నారు. అయితే, అప్పటి బెయిల్ సమయంలో డేరా బాబా ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన కుండా.. హర్యానాలోకి ప్రవేశించొద్దని నిషేదం విధించింది.

ఇక, 2017లో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అలాగే, 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబాతో పాటు మరో ముగ్గురు దోషులుగా తేలారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App