భారత్, చైనాలు కీలక నిర్ణయం
Trinethram News : భారత్ – చైనా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కైలాస మానస సరోవర్ యాత్రను ఈ వేసవిలో పునఃప్రారంభించాలని సంయుక్తంగా నిర్ణయించాయి. దీంతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీతో భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App