కుల సంఘ భవనం నిర్మించి ఇవ్వాలని వినతి

TRINETHRAM NEWS

కుల సంఘ భవనం నిర్మించి ఇవ్వాలని వినతి

నేతకాని కులస్తులకు రెండు ఎకరాల స్థలంలో నేతకాని సంక్షేమ భవనం నిర్మించి ఇవ్వాలని

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నేతకాని కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ మాట్లాడుతూ నేతకాని సమాజం రామగుండం కార్పొరేషన్ పరిధిలో పదివేల మందికి పైగా ఉన్నారని, ఆర్థికంగా, రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందలేదని తెలిపారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేతకాని కులస్తులకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వం నిర్వహించే ప్రజాసంఘాల కార్యక్రమాల్లో నేతకాని కులస్తులను కూడా భాగస్వాములు చేయాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని కులాలకు సంక్షేమ భవనాలు నుంచి ఇచ్చినట్లే నేతకాని కులానికి కూడా సంక్షేమ భవనం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామెర ప్రకాష్, నేతకాని సంఘం పెద్దపల్లి జిల్లా నాయకులు కుమ్మరి మల్లేష్, కామెర పద్మ, దుర్గం చిన్నక్క, మాదాసు సుధాకర్, బండారి వీరన్న తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top