అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పతకాలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలుఅంద జేయడమే ప్రభుత్వ లక్ష్యమని ,సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిదిలో మద్గుల్ చిట్టెం పల్లి 8 వ వార్డు నందు ఏర్పాటు చేసిన ప్రజా పాలన వార్డు సభ లో కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే రైతు భరోసా,ఇందరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అయిన సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న వార్డు సభలలో చదివి వినిపించిన జాబితాలో మీ పేర్లు లేకుంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని, వార్డ్ సభ లో ప్రదర్శన లో ఉంచిన జాబితా లో పేర్లు లను ఒకసారి చూసుకొని ఏవైన అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే కాకుండా, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పుడు నిర్వహిస్తున్న వార్డు సభలలో దరఖాసు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని కలెక్టరు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేసారు.
మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీ లలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాలు అందుతాయని అన్నారు. జాబితా లో పేర్లు లేనివారు నిరాశ పడకుండా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.ఈ వార్డు సభలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి,ప్రజా ప్రతినిధులు,వార్డు ప్రజలు, సంబంధిత అ దికరులు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App