TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవలసిందే “ఆదివాసి గిరిజన సంఘం”.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: ఆదివాసీ గిరిజన సంఘం
అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ.

ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవసిందే?
రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టాలి.

షెడ్యూల్డ్ ఏరియాలో స్థానిక ఆదివానులకు ఉద్యోగ,ఉపాధ్యాయ నియామక చట్టం సాధ్యమే
రిజర్వేషన్ సాధన కు ఐక్య ఉద్యమం చేస్తాం.
ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పాల్గొన్న ప్రజా సంఘాల డిమాండ్.!

షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలనీ, ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు , పి.అప్పల నరస రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విజయ వాడ బలోత్సవ భవన్ లో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ, అధ్యర్వం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.చిన్నం నాయుడు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, పి.అప్పల నరస మాట్లాడుతూ
జిఓనెం. 3 చట్టం వలన 19 డిపార్టుమెంట్లలో 34 రకాల ఉద్యోగ నియమకాలు స్థానికి ఆదివాసులకు హక్కుగా వుండింది. జిఓనెం. 3ని సుప్రీంకోర్టు 2020 మార్చిలో రద్దు చేయడంతో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర ఆన్యాయం జరిగింది.
అధికారంలోకి వచ్చాక ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పిస్తామని నాడు అరకు ఎన్నికల సభలో నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించి 6నెలలు గడిచిన జిఓనెం3 చట్టబద్దకు అతిగతి లేకుండా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ,మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్ వలన ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం జరగదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

1/70 చట్టం ప్రకారం స్థిర నివాసానికి అనుమతులు లేని వారు 2% శాతం మాత్రమే ఉన్న గిరిజనేతరులకు 95% పోస్టులు భర్తీ చేయడం, 98 శాతం మంది వున్న ఆదివాసుల కోసం కేవలం 5 శాతం పోస్టులు మాత్రమే కేటాయించి భర్తీ చేయడం తగదు. తమ ప్రభుత్వం వెంటనే జనరల్ డిఎస్సీ నోటిఫికేషన్ను పునర్ పరిశీలించి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు భద్రతా, భరోసా కల్పించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి తగిన చర్యలు తీసుకొవాలని గిరిజన సంఘం డిమాండ్ చేసింది.

గిరిజన గురుకులం (బైలా) నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్ డిఎస్సీ లో గురుకులం పోస్టులను విలీనం చేసింది. గిరిజన గురుకులానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వం పిజిటి, టిజిటి 12వందల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం దారుణం. గిరిజన గురుకులంలో జోనల్ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. కాని జనరల్ డిఎస్సీ మాత్రం జిల్లా యూనిట్ నోటిఫికేషన్ జారీచేసియున్నారు. గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నా రెగ్యులర్ చేయకుండా జనరల్ డిఎస్సీ ద్వారా స్కూల్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులైన, ఆదివాసీలను గెంటి వేయొద్దని డిమాండ్ చేసింది.

జీ.ఓ నెంబర్ 3 రద్దు చేసిన తర్వాత అనేకమార్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు మరియు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించిన కానీ, ఏనాడు ఆదివాసులకు 100% శాతం ఉద్యోగ రిజర్వేషన్కు చట్టబద్ధత గూర్చి ప్రస్తావన చేయలేదు. పునరుద్ధరణకు కనీసం ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో ఆదివాసీ యువతకు తీవ్రఅన్యాయం జరుగుతోంది. ఇటివల కాలం లో 1998, 2008లో సుమారు 400 + 280 ఎస్సీటీ పోస్టులను పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మినిమం టైమ్స్ స్కేల్ ప్రాతిపదికన స్థానికేతరులతో తమ ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గుచూపుతున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు.

ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ఉద్యోగ రిజర్వేషన్కు గత రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్డ్ క్లాజ్ (2) ప్రకారం చట్టబద్ధత కల్పిస్తామని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (టిఎసి) చేసిన తీర్మానాన్ని నేటి ప్రభుత్వం అమలు చేయాలి.
ఇప్పటికే ఆదివాసీ నిరుద్యోగులు తీవ్రమైన అభద్రత భావం, ఆందోళనతో ఉన్నారు. నేటికీ పునరుద్ధరణకు కనీసం ఎటువంటి చర్యలకు ఉ పక్రమించకపోవడంతో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆదివాసులకు ప్రత్యేక భాష, సంస్కృతి ఉన్నాయి. గిరిజన భాష రాని ఉపాధ్యాయులను ఏజెన్సీలో నియమించడం వల్ల ఆర్టికల్ 29, 32 ఉల్లంఘించినట్లు అవుతుంది.

కె.జి.బి.వి, వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్ తో పాటు వివిధ శాఖల లో స్థానికేతరులతో ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోయి తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు షెడ్యూల్డ్ ఏరియాలో స్థానిక ఆదివ…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App