మఠం పంచాయతిలొ ప్రముఖుల సందడి
అల్లూరి సీతారామరాజు జిల్లా,త్రినేత్రం న్యూస్. జనవరి 18:
శ్రీ మత్స్య లింగేశ్వర స్వామిని దర్శించుకున్న* తమిళనాడు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి*
హుకుంపేట మండలం లోని మఠం పంచాయతీ లోగల ప్రముఖ శైవ క్షేత్రం మత్స్యగుండం శ్రీ శ్రీ మత్స్య లింగేశ్వర స్వామి వారిని శుక్రవారం, తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ కే . గోపాల్ (ఐఏఎస్ )గారు కుటుంబ సమెతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు,అనంతరం మత్స్యగుండం వద్ద వున్నా మత్స్యలకు, ఆహారం అందించి ఆనందం వ్యక్తం చేసారు, ఆలయ చరిత్ర విశిష్ట తను స్థానికులను అడిగి తెలుసుకున్నారు,ఈ సందర్బంగా ఆలయ కమిటీ ప్రతినిధులు వారిని సన్మానించి, ఆలయ చరిత్ర పుస్తకాన్ని అందించారు, వారితో పాటు దేవాలయానికి వచ్చిన రిటైర్డ్ ఐఏఎస్ తమర్బ బాబురావు నాయుడు, మరియు హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కొట్టగుళ్లి సింహచలం నాయుడు లను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కారించారు,ఈ కార్యక్రమం లో రిటైర్డ్ ఐఏఎస్ బాబురావు నాయుడు ,స్థానిక సర్పంచ్ మఠం శాంత కుమారి , ఆలయ కమిటీ ప్రతి నిధులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App