తేదీ: 05/01/2025.
విజయవంతమైన హైందవ శంఖారావం.
ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం) న్యూస్;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సమీపంలో గల కొసరపల్లి గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్నటువంటి ఎస్ ఎల్ వి లైలా గ్రీన్ మె డోస్ వేదికలో విశ్వ హిందు పరిషత్ బహిరంగ సభ జరిగింది.
రాష్ట్రం నలుమూలల నుండి లక్షల మంది భక్తులు జైశ్రీరామ్, జై హనుమాన్ అంటూ వారి మాట మాట పలుకుల్లో వినిపించారు. సభకు వచ్చినటువంటి భారతదేశ హిందువుల లో పెద్దలు మరియు హిందూ దేవాలయాల పెద్దలు ఒక్కొక్కరిగా భక్తులకు అర్థమయ్యే రీతిలో ప్రసంగించడం జరిగింది. ఈ సభలో హైందవ శంఖారావం పూజించగా సభా ప్రాంగణం అంతా దద్దరిల్లింది. హిందూ దేవాలయాలను ఎలా రక్షించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా భక్తితోఎలా శ్రద్ధగా మెలగాలి అని అంశంపై వివరించడం జరిగింది.
సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజనం మరియు, మంచినీరు మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఎవరికి లోతుపాట్లు రాకుండా అన్ని శాఖల వారు చూసుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App