జూలై 5, 2026

IMG 20241219 WA0033

TRINETHRAM NEWS

కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి ఎస్ ఆంజనేయులు ముదిరాజ్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బి. యస్. ఆంజనేయులు ముదిరాజ్ ను తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ తరుపున ముదిరాజ్ మహాసభ నాయకులు సన్మానం చేయడం జరిగింది. ఆంజనేయులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పూర్వరంగారెడ్డి జిల్లాలో 2001 నుండి రాష్ట్ర ఏర్పాటు 2014 వరకు కీలక భూమిక పోషించడం జరిగింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం,దశాబ్దకాలం పాటు నిరంతరం పోరాటం చేయడంజరిగింది ప్రభుత్వము సేవలను గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ముదిరాజ్ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం,బి యస్ ఆంజనేయులు ముదిరాజ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తులో ఉన్నతమయిన పదవులు అలంకరించాలని కోరడం జరిగింది వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా సుమారుగా 25 శాతం జనాభా కలిగినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లోసముచిత స్థానాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము*
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శిదేశమోని మాణిక్యం ముదిరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి కృష్ణ ముదిరాజ్, కె. ఆంజనేయులు ముదిరాజ్, పరిగి మండలఅధ్యక్షులు అనంతయ్య ముదిరాజ్, సంఘ సభ్యులు వెంకటయ్య ముదిరాజ్,బాలరాజ్ ముదిరాజ్, లాలు ముదిరాజ్ నరేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page