TRINETHRAM NEWS

నారా లోకేష్ ను కలిసిన తమలపాకులు రైతులు

(12-12-2023):

పాయకరావుపేట మండలం నామవరంలో తమలపాకు రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

• మా మండలంలో సత్యవరం, మాసాహేబ్ పేట, అరట్లకోట, మంగవరం, పెదరామభద్రపురం, కొత్తూరు, శ్రీమపురం తమలపాకు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాం.

• తమలపాకు పంటకు పెట్టుబడి అధికమొత్తంలో పెట్టాల్సివస్తోంది.

• ప్రకృతివైపరీత్యాలు వచ్చిన సమయంలో పంటనష్టం తీవ్రంగా వాటిల్లుతోంది.

• పంట నష్టపోతే ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం లభించడం లేదు.

• కౌలురైతులు వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నారు.

• మీరు అధికారంలోకి పంట నష్టం వచ్చిన రైతులను ఆదుకోవాలి.

• తమలపాకు తోటలకు పంట బీమా సౌకర్యం కల్పించాలి. నారా లోకేష్ స్పందిస్తూ…

• జగన్మోహన్ రెడ్డి చేతగాని పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది.

• పంటలబీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి, కేవలం 16మంది రైతులకు మాత్రమే బీమా చెల్లించి నట్టేటముంచిన మోసగాడు జగన్.

• వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలచింది.

• టిడిపి అధికారంలోకి వచ్చాక పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటాం.

• వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటాం.