జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 15 at 16.49.45

TRINETHRAM NEWS

రేపు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

Trinethram News : అమరావతి : డిసెంబర్15
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణా లను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగం గా రేపు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించు నున్నారు.

షెడ్యూల్ ప్రకారం.. తాడే పల్లి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్న సీఎం.. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

అనంతరం 11:05 నుంచి 12:05 గంటల వరకు ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ వన్, గ్యాప్ టూ, డీ వాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనుల పురోగ తిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోను న్నారు.

ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీ క్షించనున్నారు. సమీక్ష అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్న ముఖ్య మంత్రి చంద్రబాబు.. పోల వరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నారు.

పోలవరంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్త మయింది. 600 మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page