జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 15 at 18.12.50

TRINETHRAM NEWS

ఆటో ట్రాలి లో అక్రమంగా రవాణా చేస్తున్న 12 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ (ఐజి)* ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ , టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కలమడుగు కొమరం భీమ్ చౌరస్తా నుండి ఇంద్రవెల్లి వైపుగా ఆటో ట్రాలీ (AP01Y 5675 ) వాహనం ద్వారా అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తి ని అదుపులోకి తీసుకుని, వాహనంలో తరలిస్తున్న సుమారు 12 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 36,000/- రూపాయలు.

నిందితుడి వివరాలు

1) గుర్రాల రాజేందర్ S/o మైసయ్య
Age:24, Cast: ఎరుకల, వచ్చి :డ్రైవర్ , R/o. మందపల్లి గ్రామం జన్నారం.

స్వాదినపరుచుకున్న 12 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, ఆటో ట్రాలీ వాహనం మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం జన్నారం పోలీస్ వారికి అప్పగించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page