వికారాబాద్ లో పెంచినడైట్ మెనూ ప్రకటించిన స్పీకర్
వికారాబాద్ నియోజకవర్గ త్రినేత్రం ప్రతినిధి డిసెంబర్ 14, 2024
వికారాబాద్ జిల్లా.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న డైట్ మెనూ ను ఈరోజు ఎన్నపల్లి చౌరస్తాలోని మైనారిటీ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికల) లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.
పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, RDO వాసు చంద్ర , కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్ పాతిమా , మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం , కౌన్సిలర్లు , ప్రజాప్రతినిధులు , విద్యార్థులు, తల్లి తండ్రులు తదితరులు.
కామన్ డైట్ ప్లాన్ ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ స్టోర్ రూం ను సందర్శించి, సన్నబియ్యం, సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ…
రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచారు. పెంచిన ధరలకు అనుగుణంగా కొత్త డైట్ మెనూ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది.
విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలి. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలి.
అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించింది. తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందుతుంది. విద్యార్థులు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం.
ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధింఛి నా అంతటి వారు కావాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరి చేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేసి, గురువులకు, జిల్లాకు మంచి పేరు తేవాలి అని కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App