ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంను ఫోర్త్ ఎస్టేటగా పిలుస్తారని
చొప్పదండి :త్రి నేత్రం న్యూస్
ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా డిజిటల్ మీడియా వచ్చేసిందని గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులము అయినా మేము డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సామాజిక భద్రత కొరవడిందని, అంతే కాకుండా ప్రభుత్వం నుండి ఆదరణ కూడా కరువైందని, ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా డిజిటల్ మీడియా జర్నలిస్టులు వార్తలను సేకరించి ఎప్పటికప్పుడు క్షణాలలో డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారాన్ని చెరవేస్తున్నారని డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా మంది తెలంగాణ ఉద్యమ వార్తలను కవరేజ్ చేసిన వాళ్ళే, హక్కుల సాధనకోసం డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ (DMJU) పనిచేస్తుందని ఐక్యత, ఆచరణ నినాదంతో పనిచేస్తున్నామని, కావున డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారిని జర్నలిస్టులుగా గుర్తించాలని, డిజిటల్ మీడియా జర్నలిస్టు పిల్లలకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రైవేటు విద్యా సంస్థలలో 50% ఫీజు రాయితీ కల్పించాలని, అలాగే అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలని, సామాజిక భద్రత కోసం మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ ల సాధనకోసం DMJU కృషి చేస్తుందని, డిజిటల్ మీడియా జర్నలిస్టు ల సమస్యలని వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా (DMJU) అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ము గణేష్ జిల్లా కలెక్టర్ కు మరియు DPRO లకు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కొమ్ము గణేష్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు సంతోష్, దాసరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App