ఈ నెల 14న జాతీయ మెగాలోక్ అదాలత్

TRINETHRAM NEWS

ఈ నెల 14న జాతీయ మెగాలోక్ అదాలత్.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాజీయే రాజమార్గం.
• లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఎస్పీ కె .నారాయణ రెడ్డి,IPS.ఈ నెల 14న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీకె.నారాయణ రెడ్డి,IPSతెలిపినారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 14న జాతీయ మెగాలోక్అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసు లు, ఆస్తివిభజనకేసులు,కుటుంబపరమైన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుంది అని తెలిపినారు. రాజీయే రాజ మార్గమన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూతిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.జిల్లా లోని పోలీస్ అధికారులు, కోర్టు విధులునిర్వహించే కానిస్టేబుల్ లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున ఎవరైనా తమ కేసులలో రాజీ కావాలి అనుకున్నవారు పోలీస్ అధికారులకు సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుంది అని ఎస్పీ తెలియజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top