TRINETHRAM NEWS

YSRCP : సీఎం వైఎస్ జగన్‌పై పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం!

చిత్తూరు : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ధిక్కార స్వరం వినిపించారు. దళితులకు జగన్ ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

‘నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ’ అంటున్న జగన్ దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ఎందుకు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలను ఒక్క రోజు అయినా చేరదీసి జగన్ తమ మంచి చెడ్డా గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు..

”ఐ ప్యాక్ సర్వేలో పనితీరు సరిగా లేదంటూ ఎక్కువగా దళిత నియోజకవర్గంలోనే మార్పులు ఎందుకు చేపడుతున్నారు? 2019 ఎన్నికల్లో ఐపెక్ సర్వేల ద్వారానే టికెట్లు ఇచ్చారా? పార్టీ కోసం కుటుంబాన్ని వ్యాపారాన్ని అన్ని వదులుకొని ఐదేళ్లు పార్టీ, ప్రజాసేవలో లీనమైపోయా. తాను అవినీతికి పాల్పడి భూకబ్జాలతో చెడ్డపేరు తెచ్చుకుంటున్నామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాణిపాకంలోకి వచ్చి సత్యం చేస్తారా తాను అవినీతిని చేయలేదని? నేను కాణిపాకంలో సత్యం చేయడానికి సిద్ధం..

గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా . ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత ? ఐదేళ్ళలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. ఐప్యా క్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని ..ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదు. డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోంది. ఇప్పటికీ వైసీపీపై నమ్మకం ఉంది. పార్టీ వీడే ప్రసక్తే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉంది. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నా” అని బాబు పేర్కొన్నారు..