త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న బ్యాట్మెంటన్ క్రీడాకారుని పీవీ సింధు
Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 03
భారత బ్యాట్మెంటన్ స్టార్ రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు త్వరలోనే పెళ్లిపీటలెక్కను న్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమెకు పెళ్లి ఖాయమైంది.
డిసెంబర్ 22న రాజస్థాన్ లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈనెల 20న ప్రారంభం కానున్నాయి.
ఇరు కుటుంబాలు ఒకరి కొకరు చాలా కాలంగా తెలుసు. అయితే గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయానికి వచ్చాం. జనవరి నుంచి ఆమె షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయనున్నట్లు నిర్ణయించుకున్నారు.
వచ్చే సీజన్ తనకు ఎంతో ముఖ్యమైనది’’ అని సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. ఇక సింధు మనువాడనున్న వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
సయ్యద్ మోదీ అంతర్జా తీయ సూపర్ 300 టోర్నీ సింగిల్స్లో స్టార్ షట్లర్ పీవీ సింధు ఛాంపియన్గా నిలిచింది. జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనాకుచెందిన వులువోయును సింధు మట్టికరిపించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App