TRINETHRAM NEWS

ఓయో’లో డ్రగ్స్‌ పార్టీ.. కొరియోగ్రాఫర్‌ అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌ : మాదాపూర్ ఓయో రూమ్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డారు. కన్హమహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు పట్టుకున్నారు..

ప్రియాంకరెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ టీవీ షోలలో కన్హా మహంతి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ డ్యాన్స్‌షోలలో చాలా కాలం పాటు పనిచేసిన కన్హా మహంతి పలుమార్లు విజేతగా నిలిచారు. మహంతి, ప్రియాంక రెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం.

పార్టీలో పాల్గొన్న నలుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.పార్టీ జరిగిన ప్రదేశం నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App