TRINETHRAM NEWS

ప్రకాశం జిల్లా చీమకుర్తి..
ప్రకాశం జిల్లా 14వ మహాసభలు చీమకుర్తి పట్టణంలో ఈనెల 13,14,15 తేదీల్లో బివిఎస్ఆర్ కళ్యాణమండపంలో జరగనున్నాయి. వాటిని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు SKమాబు కోరినారు. సిపిఎం చీమకుర్తి మండల విస్తృత సమావేశం పూసపాటి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా SK మాబు మాట్లాడుతూ మండలంలో గ్రానైట్ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల పోరాటాలకు సిపిఎం అండగా నిలుస్తుందని అన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తుందన్నారు. జిల్లా మహాసభల జయప్రదానికి ఈనెల 7వ తేదీనచీమకుర్తి పట్టణం లో ఇంటింటికి సిపిఎం దళాలు ప్రజల వద్దకు వస్తా ఉన్నాయని ప్రజలు తమ వంతు ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. మహాసభల జయప్రదానికి వివిధ రకాల నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పమిడి వెంకట్రావు, కాలం సుబ్బారావు, j జయంతి బాబు, మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు మాట్లాడినారు సమావేశంలో జిల్లా నాయకులు బంకా సుబ్బారావు,T తిరుపతిరావు, మండల నాయకులు b శ్రీను, టి రామారావు, కే చిన్నపరెడ్డి, పి సురేష్,సిహెచ్ కొండయ్య, n శ్రీను, పద్మ కొల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్ కృష్ణయ్య kవెంకటేశ్వర్లు n వెంకటేశ్వర్లు, tశ్రీకాంత్, u ఆదిలక్ష్మి, పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App