కిట్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం..
స్థానిక కిట్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ పెద్దారవీడు మండలంలో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అన్నా క్రిష్ణ చైతన్య. ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పివి అనిల్ కుమార్ మాట్లాడుతూ, మార్కాపురం గవర్నమెంట్ హాస్పటల్ వారితో కలిసి పెద్దారవీడు మండల గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి, ఎయిడ్స్ గురించి అవగాహన కార్యక్రమం చేశామని తెలిపారు, అలానే ఎయిడ్స్ ని ఎలా నివారించాలి, ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చిన వాటిని ఎలా నిర్మూలించుకోవాలి, అనే వాటిపై ప్రజలకు అవగాహన కల్పించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రంగనాయకులు, కళాశాల ఏవో బి ప్రభాకర్, వివిధ విభాగపు అధిపతులు పి రామ్మోహన్, డాక్టర్ జెవి అనిల్ కుమార్,కే రాముడు, కే కిషోర్ బాబు, ప్రసన్న మురళి , జే రమణారెడ్డి,ఏ. అమృతవల్లి , పి మనోహర్, ఫిజికల్ డైరెక్టర్స్ ఎన్ రంగస్వామి, ఎన్ వి ఎస్ ఎన్ అంజనీ కుమార్, ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App