TRINETHRAM NEWS

నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

Trinethram News : సిద్దిపేట జిల్లా : నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. మధ్యాహ్నం 1.30కు ముఖ్యమంత్రి బేగంపేట నుంచి హెలికాప్టర్​లో సిద్ధిపేటకు బయల్దేరుతారు. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ వద్ద HCCB – కోకా కోలా ఫ్యాక్టరీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 3 గంటలకు తిరిగి హైదరాబాద్​కు బయల్దేరుతారు. 3.30 కు ఎన్టీఆర్​ మార్గ్​లోని హెచ్​ఎండీఏ గ్రౌండ్స్​లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆరోగ్య ఉత్సవాలలో పాల్గొంటారు. ఇక అటు ఇవాళ 206 అంబులెన్స్‌లు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ చేతుల మీదుగా అంబులెన్స్‌లు ప్రారంభం అవుతాయి..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App