ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌

TRINETHRAM NEWS

ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌..!

ముంబయి: ఈ మధ్య ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతూ ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు వరుస ఫోన్‌ కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గురువారం మరో కాల్‌ వచ్చింది..

ఈసారి ఏకంగా ప్రధాని మోదీ (PM Modi)పై బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

ముంబయి ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు గురువారం ఉదయం ఓ బెదిరింపు కాల్‌ (Threat call) వచ్చింది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని హత్య చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు ఓ మహిళ బెదిరించారు. అందుకు ఓ ఆయుధాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితురాలి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌ను ట్రేస్‌ చేస్తున్నారు. సదరు మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

కాగా.. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను బెదిరిస్తూ ముంబయి ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు వరుసగా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top