TRINETHRAM NEWS

భగత్ సింగ్ కలలుగన్న సోషలిజం కొరకు యువత,విద్యార్ధి లోకం ఆలోచించాలి.
ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్.
Trinethram News : Medchal : భగత్ సింగ్ మేనల్లుడు నేడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని గాంధీనగర్,జగత్గిరిగుట్ట, మక్దుమ్ నగర్ భగత్ సింగ్ మార్గ్ లలో ఉన్న భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి షాపూర్ నగర్ విన్ పాలస్ ఫంక్షన్ హల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు సుమారు 600 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భగత్ సింగ్ చిన్నతనంలోనే స్వంతంగా చదివి ఆలోచించే గుణం కలిగివుండెవరని అందుకే సమాజంలో జరిగిన అన్ని అన్యాయాలను ప్రశ్నిస్తూ వాటికి శాస్త్రీయమైన సమాదానాలు రాబట్టేవారని అందుకే తన జీవితంలో ఎవరు చెయ్యని సాహసాన్ని చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం ఆశువులు బాసరని అన్నారు. తన చుట్టు ఉన్న సమాజాన్ని చూస్తూ అప్పటికే ఉన్న మత, కుల,లింగం లాంటివి మనుషులను విభజించటానికే ఉపయోగపడుతున్నాయని అలాంటి విభజన ఉండొద్దు అంటే ఈ దేశంలో అందరూ సమానులే అనేభావన తీసుకురావాలని ఆనాడే 17 సంవత్సరాల వయసులోనే నౌజవాన్ సభ ఏర్పాటు చేసి ప్రజలు ముక్యంగా యువత,మహిళలు కులం,మతం అనే అభిప్రాయాల నుండి దూరం ఉండాలని,శాస్త్రీయమైన విద్యను అభ్యసించాలని కోరాడని అన్నారు.అంతే కాకుండా ఈ దేశ సంపద కొంత మంది చేతిలో కేంద్రికృతం కాకుండా అందరికి చెందాలని దాన్ని కేవలం సోషలిస్టు వ్యవస్థతోనే సాధించవచ్చు అని అన్నారు.భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కారణం చదువని,చదివిన చదువును ఆచరణలో చూపాడు కాబట్టే అయినా ఇంతమందికి నేటికీ స్ఫూర్తిగా,చైతన్యం అందిస్తునె ఉన్నారని కావున భగత్ సింగ్ గురించి మాట్లాడాలని అప్పుడేప్రజాస్వామ్యం ను బతికించుకోగల్గుతామని అన్నారు.కావున యువత విద్యార్థులు భగత్ సింగ్ గురించి చదవాలని అన్నారు. భగత్ సింగ్ ఆనాడే మతం పేరుతో జరిగిన దోపిడీని,దౌర్జన్యాలను వ్యతిరేకించాడని,నేడు భగత్ సింగ్ బతికి ఉంటే మత రాజకీయాలను వ్యతిరేకించేవారని అన్నారు.
ఈ సందర్బంగా గాంధీనగర్ లో ఠాగూర్ పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలకగా, జగతగిరిగుట్ట,భగత్ సింగ్ మార్గ్లో సిపిఐ నాయకులు,విన్ పాలస్ ఫంక్షన్ హల్లో నేతాజీ విద్యార్థులు స్వాగతం పలికారు. సంఘమిత్ర ,పటేల్,ఫ్రీడమ్,నాగార్జున,సాధన,బాపూజీ పాఠశాల విద్యార్థులు దేశభక్తి గేయాలా పై డాన్స్ చెయ్యగా,పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందచేశారు. ప్రజానాట్యమండలి అధ్యక్షుడు శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు ఉప్పలయ్య,జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్,భాస్కర్ బృందం,వెంకటాచారి బృందం దేశభక్తి పాటలు పాడి విద్యార్థుల్లో ఉత్తేజని నింపారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ కార్యదర్శి నేత్రుత్వం వహించగా జిల్లా కార్యవర్గ సభ్యుడు కిషన్,జనవిజ్ఞాన వేదిక నాయకులు వరప్రసాద్,రాష్ట్ర నాయకులు ఏసురత్నం,మహిళా సమాఖ్య నాయకురాలు హైమావతి, మండల కార్యదర్శులు శ్రీనివాస్,కృష్ణ, సత్యప్రచారక్ మోహన్ బైరాగి,డాక్టర్ రోష్ని,డాక్టర్ సోము మర్ల, డాక్టర్ జతిన్,రచయిత దీవికుమార్, సహాయ కార్యదర్శి దుర్గయ్య,కార్యవర్గ సభ్యులు సధనంద్,రాములు, సీ. వెంకటేష్, సహాదేవ్ రెడ్డి,కే.వెంకటేష్,నర్సింహ రెడ్డి,రాంరెడ్డి,బాలరాజ్,రమేష్,,దావీద్, వాసు, సామెల్,రవి,నాగప్ప, సాయిలు,ఇమమ్ బాలాజీ, కనకయ్యలు పాల్గొన్నరు.
కార్యక్రమ నిర్వాహకులు అఖిల భారత యివజన సమాఖ్య అధ్యక్ష,కార్యదర్శులు సంతోష్ వెంకటేష్ లు నాయకత్వం వహించి వందన సమర్పణ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App