ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 11 26 at 18.22.24

TRINETHRAM NEWS

అంబేద్కర్ కు టిడిపి ఘన నివాళి..!

రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత దేశ
రాజ్యాంగం రచించి నేటికి 75 సంవత్సరాల అయిన సందర్భంగా టిడిపి పక్షాన నివాళులర్పిస్తున్నామని అన్నారు. ఈ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు అణగారిగిన వర్గాలకు ఎస్సీ బీసీ వర్గాలకు ఆగ్రకులాల ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గోదావరిఖని తెలుగుదేశం సింగరేణి కాంగ్రెస్ లేబర్ యూనియన్ కార్యాలయంలో నారా చంద్రబాబునాయుడు, లోకేష్ బాబు ఆదేశాలతో గత 22 రోజులుగా సభ్యత్వ నమోదు పెద్ద సంఖ్యలో చేయిస్తున్నామన్నారు. సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తో పాటు సాధారణ మరణం పొందిన వారికి 10వేల రూపాయలు ప్రకటించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వెంట ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క సభ్యత్వం ప్రతి ఒక్క కార్మిక కర్షకులు తీసుకుంటారని కోరుతున్నాము.

కే నిమ్మకాయలు ఏడుకొండలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంటు టిఎన్టియుసి అధ్యక్షుడు, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరిస్ లేబర్ యూనియన్ కోశాధికారి, నరెడ్డి స్వరాజ్యం తెలుగుదేశం పార్టీ రాష్ట్రమాజీ మహిళా కార్యదర్శి, చిట్యాల అశ్విని రాష్ట్ర మహిళా మాజీ కార్యదర్శి, బండారి స్రవంతి పెద్దపల్లి పార్లమెంట్ మాజీ కార్యదర్శి, రామగిరి రాజేశ్వరి టౌన్ ఎస్సీ సెల్ కార్యదర్శి మాజీ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page