TRINETHRAM NEWS

దీక్షా దివస్‌కు బీఆర్‌ఎస్‌ కార్యాచరణ.. నేడు అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు..!!

Trinethram News : హైదరాబాద్‌ : నవంబర్‌ 26 : దీక్షా దివస్‌ ఆర్తి, స్ఫూర్తిని రగిలించేందుకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన, తద్వారా రాష్ట్ర సా ధనకు దారితీసిన రోజుగా తెలంగాణ చరిత్రలో 29 నవంబర్‌ 2009కి ప్ర త్యేక స్థానం ఉన్నది.

‘తెలంగాణ వచ్చు డో.. కేసీఆర్‌ సచ్చుడో.., తెలంగాణ జైత్రయాత్రో.. కేసీఆర్‌ శవయాత్రో’ అంటూ తెలంగాణ కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కరీంనగర్‌ నుంచి సిద్దిపేట ఆమరణ దీక్షాస్థలి కి బయలుదేరిన కేసీఆర్‌ను అల్గనూరు క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు అరెస్టు చేసి అత్యంత నాటకీయ, ఉత్కంఠ ప రిణామాల మధ్య ఖమ్మం జైలుకు తరలించడంతో ఖమ్మం సబ్‌జైలు నుంచే కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు ది గారు. నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు 11 రోజులపాటు తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప తమకు మరో ప్రయత్యామ్నా యం అక్కరలేదని తెగేసి చెప్పిన నేపథ్యంలో నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని ప్రకటించారు.

కేసీఆర్‌ ఆమరణ దీక్ష తెలంగాణ సమాజాన్ని ఏకోన్ముఖం చేయ డం వల్లే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ 2010 నవంబర్‌ 29వ నుంచి ఆ తేదీని దీక్షా దివస్‌గా పాటిస్తున్నది. ఈ ఏడాది కూడా దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధం అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యాచరణపై సమీక్షించేందుకు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జడ్పీ చైర్మన్లు సహా పార్టీ సీనియర్‌ నేతలను జిల్లాకో ఇన్‌చార్జీని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం దీక్షా దివస్‌ జిల్లా ఇన్‌చార్జీలు అన్ని జిల్లాల్లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2009లో నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు 11 రోజులపాటు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటీ? పోరాట రూపా లు, పోరాటయోధులు సహా ఇతరేతర ముఖ్య ఘట్టాలను నెమరువేసుకుంటూ 14 ఏండ్ల క్రితం తెలంగాణ స్థితిగతులు, పోరాట నేపథ్యాన్ని ఈతరానికి పరిచయం చేయడానికి దీక్షా దివస్‌ను ఎలా వేదికగా మలుచుకోవాలనే అంశాలపై సమాలోచనలు చేయనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App