99 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

TRINETHRAM NEWS

99 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వివరాలు సేకరించిన ఎన్యుమరేటర్

*సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, నవంబర్ -25: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లాలో నవంబర్ 24 నాటికి 99 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.

సోమవారం సర్వే ఎన్యుమరేటర్ లు పెద్దపల్లి కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని జిల్లా కలెక్టర్ కోయ హర్ష కుటుంబ సర్వే నిర్వహించారు. సర్వే సిబ్బందికి కలెక్టర్ పూర్తిగా సహకరిస్తూ వివరాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో నవంబర్ 24 నాటికి మొత్తం 2 లక్షల 46 వేల 167 ఇండ్ల సర్వే పూర్తయిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 64 వేల 857 ఇండ్లు (100 శాతం), పట్టణ ప్రాంతాలలో 81, 310(97.37 శాతం) సర్వే పూర్తయిందని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో పెండింగ్ సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారం పకడ్బందీగా భద్రపర్చాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top