మంచిర్యాల జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్త్ మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్.,
పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలు
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు 17 వ తేది (ఆదివారం), 18 వ తేది (సోమవారం) రెండు రోజులు పాటు జరిగే గ్రూప్-III రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలో 38 సెంటర్లు, బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో 10 సెంటర్ లు మొత్తం 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మొత్తం 15120 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.ఈ పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు అని మరియు పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు,వంటివి తీసుకువెళ్లడానికి అనుమతి ఉండదని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద తనిఖీలు నిర్వహించే పోలీసు వారికి సహకరించగలరని డీసీపీ పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App