WhatsApp Image 2023 12 30 at 11.39.30 AM
వంజంగి టూరిస్టులుకు జనవరి 2 నుంచి జనవరి 5 వరకు నిషేధం
పాడేరు గిరిజన ప్రాంతాల్లోని మేఘాల కొండగా పిలిచే వంజంగి హిల్స్ సందర్శనను నాలుగు రోజులపాటు నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచనలతో వంజంగి కొండపై నుంచి లగిశపల్లి వరకు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలోనే జనవరి 2 నుంచి జనవరి 5వ తేదీ వరకు వంజంగి కొండకు రాకపోకలు నిలిపి వేశామని ప్రకటించారు. ఈ విషయాన్ని పర్యాటకులు గమనించవలసిందిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు.
