TRINETHRAM NEWS

సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు..

క్వింటాల్ కు రూ. 7521 మద్దతు ధర..

సన్న వరి ధాన్యానికి క్వింటాల్ కు రూ. 500 బోనస్.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు.

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సీసీఐ కోనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యమైన పత్తికి క్వింటాలుకు రూ.7521 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు తెలిపారు.

పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో బుధవారం సీసీఐ కోనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో, జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ
సీసీఐ నిబంధనల మేరకు నాణ్యమైన పత్తికి మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్, జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నట్లు వివరించారు. పత్తి కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర రాద్దాంతాన్ని రైతులు నమ్మవద్దని కోరారు. వర్షాభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొంత మేర పత్తి దిగుబడి తగ్గిందన్నారు.

సాన్నవరికి క్వింటాలుకు రూ.500 బోనస్.

పెద్దపల్లి మండలం, నిమ్మనపల్లి నిట్టూరు గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. 17 శాతానికి మించి ధాన్యంలో తేమ లేకుండా రైతులు చూసుకోవాలని చివరి గింజవరకు కోనుగోలు చేసే బాధ్యత తనదేనన్నారు. ధాన్యంలో గింజ కూడా కటింగ్ లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 41కిలోలకు ఒక్క గ్రాము కూడా అదనంగా తూకం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని నిర్వాహకులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో ఛైర్మన్లు మాదిరెడ్డి నర్సింహ రెడ్డి, ఆళ్ళ సుమన్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కూర మల్ల రెడ్డి,జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పృథ్వీ రాజ్, పెద్దపల్లి విండో సీఈఓ మధన్ మోహన్, డైరెక్టర్లు, సీసీఐ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App