క్రీడా సమీక్ష సమావేశం లో తగు సూచనలు చేసిన :ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణలో నూతన క్రీడావిధానం రూపకల్పన, స్పోర్ట్స్ హబ్, మరియు సీఎం కప్ మరియు ఇతర అంశాలపైన నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలూ మరియు తగు సూచనలు చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
క్రీడాకారుల నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు అంతర్జాతీయ క్రీడారంగంలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు.
ప్రతిభావంతులైన యువకులను గుర్తించి వారి చదువుకు ఆటంకం కలగకుండా జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు.
ప్రతిపాదిత క్రీడా విధానం ఈ దిశలో దశలను కలిగి ఉండాలి. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు, రాష్ట్ర యువత ఆసక్తిని కనబరిచే క్రీడలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలి. సంబంధిత అధికారులు ఎంఓయూల ద్వారా విదేశాల్లోని యూనివర్సిటీలతో పాటు కోచ్‌ల మద్దతును పొందవచ్చు.
ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేసే విధానాన్ని అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు ఆ విదంగా ఆదేశాలు జారీ చేయాలని కోరడం జరిగింది .
తెలంగాణకు చెందిన క్రీడాకారులు 2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేలా చూడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించడం జరిగింది.
దీనికి ముఖ్యఅతిధులుగా జయశ్ రంజన్ మహేష్ గౌడ్ మరియు జితేందర్ రెడ్డి మరియు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App