6 గోల్డ్ మెడల్స్ సాధించిన స్పందన విద్యార్థులను
అభినందించిన రామగుండం ఏసిపి మడత రమేష్
ఈనెల 3 తేదీ ఆదివారం నీ యుధ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ కూకట్ పల్లి లో జరిగిన ఐదవ కుంఫు కరాటే టైక్వాండో జాతీయ స్థాయి కరాటే పోటీలలో కటాస్ విభాగంలో స్పందన పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు బంగారు పతకాలు ఒక విద్యార్థి రజిత పథకం సాధించడం పట్ల రామగుండం ఏసిపి మడత రమేష్ మెడల్స్, సర్టిఫికెట్లను ప్రధానం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల అవసరమని తద్వారా శరీర దౌర్ద్యాన్ని పెంపొందించుకోవచ్చని అలాగే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని విద్యార్థి దశలోనే అన్నిట్లో శిక్షణ పొందాలని అన్నారు. చెడు అలవాట్లకు పోకుండా క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కరాటే లో గోల్డ్ మెడల్స్ సాధించిన వి. వర్షిని 9వ తరగతి, కృతిక్ సాయి 7వతరగతి, ప్రశస్త శ్రీ 7 వతరగతి, అక్షరన్ 8వ తరగతి, సుచిత్ర ఆరో తరగతి, శ్రీ చైత్ర 3వ తరగతి, బ్రాంజ్ మెడల్స్ సాధించిన రుత్విక్ మూడో తరగతి శిక్షణ ఇచ్చిన సంపత్ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రసాదరావు, పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ రావు, ఇంచార్జ్ వనిత, రిజ్వానా, సుహాసిని, అమల, మాధవి, నిరుప, హరిత తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App