జూలై 16, 2026

IMG 20241105 WA0027

TRINETHRAM NEWS

తల్లి పేరుపై ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ పేడ్ మాకేనామ్*అనేనినాదంతో ప్రధానమంత్రి పిలుపు మేరకు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలోఈరోజువికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు మహావీర్ హాస్పిటల్ రోడ్డులోగలమున్సిపల్పార్కులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమానికి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లిమంజులరమేష్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడడంతో పాటు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం అనంతగిరిలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో చైర్ పర్సన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో స్థానిక కౌన్సిలర్లు చందర్ నాయక్, మోముల స్వాతి రాజ్ కుమార్, కమిషనర్ జాకిర్ అహ్మద్, నాయకులు హసిబ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యువజన అధికారి ఐజయ్య, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page