TRINETHRAM NEWS

సింగరేణి సంస్థ చిరు వ్యాపారులకు సమన్యాయం జరిగేలా చూడాలి
అభివృద్ధి సుందరీకరణ పేరిట చిరు వ్యాపారుల
ఇబ్బంది

పెట్టడం సరైనది కాదు
చిరు వ్యాపారులకు న్యాయం జరగకపోతే బి.ఆర్.ఎస్ పార్టీ పక్షాన జి.ఎం కార్యాలయం ముట్టడిస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకుపోతాం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే
కోరుకంటి చందర్

సింగరేణి సంస్థ అభివృద్ధి, సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారుల ఇబ్బంది పెడుతుందని పూట గడవడం కోసం
ఇతర ప్రాంతాల నుంచి ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి చిరు వ్యాపారాలు చేసుకుంటూజీవిస్తున్నావారి జీవితాలు ఆగమ్యగోచరంగా గందరగోళంగా మారాయని సింగరేణి సంస్థ చిరు వ్యాపారులకు సమన్యాయం జరిగేలా చూడాలని లేదంటే బిఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారులకు అండగా నిలుస్తుందని వారి తరఫున పోరాటం చేస్తుందని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ హెచ్చరించారు.

సోమవారం సాయత్రం గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరిఖని పట్టణంలోని హనుమాన్ నగర్ శివాజీ నగర్ గాంధీనగర్ ఓల్ద్ అశోక్ టాకిస్ తదితర ఏరియాల్లో చిరు వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న వ్యాపారులు ముందస్తు సమాచారం లేకుండా వారికి ఎలాంటి సమయం ఇవ్వకుండా దౌర్జన్యంగా వారి దుకాణాలను కూల్చడంతో వ్యాపారస్తులు ఆవేదన చెందుతున్నారని భయ భ్రాంతులకు గురైతున్నారని అన్నారు చిరు వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా వారి దుకాణం కూల్చివేయడం ఎంటని ప్రశ్నించారు. వ్యాపారాలు చేసుకుంటేనే బతికే పేద కుటుంబాలను రోడ్డుమీద పడేయడం సింగరేణి సంస్థకు ఎంతవరకు న్యాయమన్నారు. చిరు వ్యాపారస్తులకు న్యాయం జరగకపోతే బిఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడుతామని జిఎం కార్యాలయం ముట్టడి చేపడతామని రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యను తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు.
పదేళ్ల కెసిఆర్ నాయకత్వంలో 100 కోట్ల నిధులతో రామగుండం కార్పోరేషన్ లో త్రాగు నీరు డ్రైనేజీ సమస్యలను తీర్చడం జరిగిందన్నారు. టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో రామగుండం కార్పోరేషన్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ వంతు ల కృషి చేశామని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో కాలనీల్లో నెలకొన్న త్రాగునీరు సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజల జీవితాల్లో వారి జీవన విధానంలో వెలుగు నింపే కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతే బాగుంటుందని చెప్పారు.

ఎన్నికల సమయంలో మేం గెలిస్తే మార్పు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాకా చిరు వ్యాపారుల దుకాణాలు కుల్చడం వారిని రోడ్డున పడేయాడమేనా మీరు తెచ్చిన మార్పా అని ప్రశ్నించారు. ఈ విలేఖరుల సమావేశం లో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్ పాముకుంట్ల భాస్కర్ బాదె అంజలి అచ్చే వేణు నారాయణదాసు మారుతి చల్లగురుగుల మెగిళి చెలకలపల్లి శ్రీనివాస్ ఆడప శ్రీనివాస్ సట్టు శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రావన్ మహేందర్ శేషగిరి వెంకన్న చింటూ నిట్టూరి రాజు నీరటి శ్రీనివాస్ శ్రీనివాస్ రాజ్ కుమార్
మహేందర్ శేషగిరి పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App