జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 29 at 1.48.40 PM

TRINETHRAM NEWS

రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌.

హైదరాబాద్‌ డిసెంబర్‌ 29:స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల నియామకానికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్టు మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ తెలిపింది.

హైదరాబాద్‌ బండ్లగూడ లోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్‌ కొనసాగనున్నదని వెల్లడించింది ఇందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నది.

1.25 పద్ధతిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేస్తామని స్పష్టంచేసింది ఈ మేరకు ప్రొవిజినల్‌ లిస్టును విడుదల చేశామని అభ్యర్థులకు సమాచారం కూడా ఇచ్చామని తెలిపింది.

అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు రాక పోయినా కావాల్సిన పత్రాల్లో ఏవైనా సమర్పించక పోయినావారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ జారీ చేసింది.

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మరో 1,890 పోస్టులను ప్రభుత్వం జత చేసింది దీంతో మొత్తం పోస్టులు 7,094కు పెరిగాయి ఈ నెల 18న ఫలితాలు విడుదల చేసింది.

You cannot copy content of this page