TRINETHRAM NEWS

Lions Club free breakfast for 365 days in Khani

ఖనిలో నిత్య అల్పాహారం అందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం మాజీ డిస్టిక్ గవర్నర్ హనుమండ్ల రాజిరెడ్డి

ఉచిత అల్పాహార సేవలకు 365 రోజులు

ఖనిలో 365 రోజులుగా లయన్స్ క్లబ్ ఉచిత అల్పాహారం…

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా 365 రోజులు పూర్తి చేసుకున్న ఉచిత నిత్య ఆల్పాహార వేడుకలు నిర్వహించారు. బుధవారం గోదావరిఖనిలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ వి ఎల్లప్ప, ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్య ఆల్పాహార పంపిణీ 366 రోజులు అయిన సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిస్టిక్ గవర్నర్ హనుమాండ్ల రాజిరెడ్డి, ప్రమోద్ కుమార్ రెడ్డి, సీనియర్ సభ్యులు కోదండరాం, బద్వేషం, వెంకట రమణారెడ్డి, మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి, జోనల్ చైర్మన్ కె రాజేందర్ మాట్లాడుతూ, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రతిరోజు కూలి పనుల కోసం, వివిధ అవసరాలపై వచ్చే నిరుపేదలకు గత సంవత్సరం నుండి క్రమం తప్పకుండా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా అల్పాహారం అందజేయడం గర్వకారణమని, రామగుండం లయన్స్ క్లబ్ ముందుండడం అభినందనీయమని అన్నారు. ఇంకా సీనియర్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, గుండా వీరేశం, పోకల ఆంజనేయులు, తానిపర్తి గోపాలరావు, మనోజ్ కుమార్ అగర్వాల్, కోలేటి శ్రీనివాస్, డి లక్ష్మారెడ్డి, లక్కం బిక్షపతి, తానిపర్తి విజయలక్ష్మి బంక కళావతి, మగువ అధ్యక్షురాలు సునీత, డాక్టర్ లక్ష్మీవాణి, శశికళ, రంగమ్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lions Club free breakfast for 365 days in Khani