Happy Angilipula Bathukamma festival to all the girls of Vardhannapet Constituency
తెలిపిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు.
ఈ తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోనున్న ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువుల వద్ద ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App



Pingback: Bathukamma and Dussehra : బతుకమ్మ, దసరా వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు - TRINETHRAM NEWS