TRINETHRAM NEWS

Desperate search for missing man in Godavari river

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరి నదిలో గత గురువారం నాడు మధ్యాహ్నం గోదావరి నదిలో తన స్నేహితులతో స్నానానికి వెళ్లి,గల్లంతైన సుదర్శి బాలరాజు కోసం గోదావరిఖని ఏసీపి ఎం.రమేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని 2 టౌన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.గల్లంతయిన ప్రదేశం అయిన సమ్మక్క గద్దల వద్ద గోదావరి నదిలో గజ ఈతగాల్ల తో వెతికించడం జరిగింది.
ఈరోజు ప్రత్యేకంగా తెప్పించిన స్పీడ్ బోటు తో కూడా గోదావరి నది బ్రిడ్జి దగ్గర నుండి సుందిళ్ళ బ్యారేజ్ వరకు వాళ్ళ బంధువులతో కలిసి, ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.కానీ మృతిని జాడ ఎక్కడ తెలియలేదు.ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి ప్రవాహం విడుదల చేయడం వలన నీటి ప్రవాహ వేగానికి ఇంకా ముందుకు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇందులో ఫైర్ స్టేషన్ సిబ్బంది సహాయం కూడా తీసుకున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంత సమీప పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం ఇచ్చామని,ఏదైనా గుర్తుతెలియని శవం కనబడితే,సమాచారం ఇవ్వవలసిందిగా కోరామని, గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాదరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపి ఎం.రమేష్, మరియు గోదావరిఖని టూ టౌన్ సిఐ ఎన్ ప్రసాద్ రావు ఎస్ఐ లు వెంకటేశ్వర్, ఫరీద్ లు మరియు కానిస్టేబుళ్లు కృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, భార్గవ్,రవి,రాజేందర్, రాజయ్య,కిరణ్ కనకయ్య,రాజ్ కుమార్ లు, ఫైర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ మరియు సిబ్బంది,గజ ఈతగాళ్లు మరియు స్పీడ్ బోర్డ్ డ్రైవర్ వంశీ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App