US presidential candidate Kamala Harris party office shot
Trinethram News : అమెరికా : సెప్టెంబర్ 25
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు చెందిన పార్టీ ప్రచార కార్యాలయం పై కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి కార్యాలయంపై తూపాకులతో ఫైరింగ్ కు పాల్పడ్డారు.
అయితే ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కాల్పులు ఘటన మరువకముందే ఇప్పుడు మరోసారి కాల్పులు జరిగాయి.
అయితే ఆ సమయంలో పార్టీ ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వీరిద్దరిపై దాడులు జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.ఈ కాల్పుల ఘటనకు సంబంధించి కార్యాలయం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆఫీసు కిటీకిల నుంచి కాల్పులు జరిపి నట్లు అధికారులు గుర్తించారు.
రెండు నెలల క్రితం ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన మరువక ముందే ఇప్పుడు కమలా హారిస్ కార్యాల యంపై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App