TRINETHRAM NEWS

Leaders should work for the welfare of the people

అధికారులు ప్రజలకు జవాబుదారీ గా ఉండాలి…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమైన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్…

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ప్రజా ప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పష్టం చేశారు.

గోదావరిఖనిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని సూచించారు. ఇదే క్రమంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని పేర్కొన్నారు. అధికారులు ప్రజల సమస్యల విషయంలో స్పందించకపోతే ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇదే క్రమంలో దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రామగుండంలో మూతపడిన జన్ కో పవర్ ప్లాంట్ స్థానంలో త్వరలో 1,800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమైన అన్నారు. స్థానికంగా ఉన్న అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.

అలాగే పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మూతపడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు స్థానంలో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం అన్ని రకాల రూపకల్పన చేశానన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి కార్మికుల సంక్షేమంలో భాగంగా సంస్థ సాధించిన లాభాలలో 33 శాతం వాటా ఇప్పించామని గుర్తు చేశారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఎన్నడూ లేని విధంగా ఐదువేల దసరా బోనాంజా ప్రకటించమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, అన్ని రకాల అభివృద్ధి పనులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం అండదండగా ఉంటుందని అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Leaders should work for the welfare of the people