ప్రముఖ ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధదాస్ లేటెస్ట్ సర్వే

TRINETHRAM NEWS

ప్రముఖ ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధదాస్ లేటెస్ట్ సర్వే…

రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో శాంపిల్స్ సేకరణ…

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ టీడీపీ- జనసేన పోటీ పడుతున్నాయి.

తన సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందని జగన్ ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ అంచనా వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ఏపీలో పబ్లిక్ పల్స్ ఏంటనేది బయట పెట్టారు. అనూహ్య ఫలితాలు వెల్లడించారు…

మారుతున్న సమీకరణాలు

ప్రముఖ సెఫాలజిస్ట్..ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధదాస్ ఏపీలో ప్రజల మూడ్ ఏంటనేది వెల్లడించారు. ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వేలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో బయట పెట్టారు.

పార్ధదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం వైసీపీకి 46 శాతం ప్రజల మద్దతు ఉంది. అదే విధంగా టీడీపీకి 40 శాతం, జనసేనకు 11 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడించారు.

ప్రజల మద్దతు ఎవరికి

ఇక..ముఖ్యమంత్రిగా ప్రజా మద్దతు పైనా ప్రజానాడి ఏంటనేది బయట పెట్టారు.

జగన్ ముఖ్యమంత్రిగా 46 శాతం మంది ప్రజలు కోరుకుంటుండగా..చంద్రబాబు సీఎం కావాలని 36 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

లోకేష్ సీఎంగా 8 శాతం ప్రజలు..పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా 10 శాతం మంది కోరుకుంటున్నారని విశ్లేషించారు.

ఏపీలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసిన ప్రజాభిప్రాయం మేరకు ఈ ఫలితాలు వెల్లడించినట్లు స్పష్టం చేసారు.

రాజమండ్రి సిటీ, శ్రీకాళహస్తి, పెదకూరపాడు, నెల్లూరు సిటీ నియోజవకర్గాల్లో శాంపిల్స్ సేకరించినట్లు స్పష్టం చేసారు.

ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే అంశంలో చంద్రబాబు కంటే జగన్ కు 10 శాతం మంది ప్రజల మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది.

You cannot copy content of this page

Scroll to Top