Grand celebrations in Hyderabad Rabindra Bharati
తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ కు రామగుండం ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆత్మీయ సన్మానం…
రామగుండం: తెలంగాణ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ గా ఇటీవల ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ ను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆత్మీయంగా సన్మానించారు
హైదరాబాద్ లో త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన వివిధ కులాల ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొని మహేష్ కుమార్ గౌడ్ కు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకమైన పదవిని వరించిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతం తో పాటు ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి అని పేర్కొన్నారు. అన్ని వర్గాలతో అందరితో ఆత్మీయంగా కలిసి ఉండే మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రం లోని ప్రజలు ఆశించిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నారన్నారు.
ఈ క్రమంలో పదేళ్ల గడీల పాలన నుంచి స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ చేతికి ప్రజలు పరిపాలన వ్యవస్థ ను అవకాశాన్ని ఇచ్చారన్నారు. ఇదే క్రమంలో ప్రజలు ఆశించిన మేరకు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి టీం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో పార్టీని ప్రజా ప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను సమన్వయ పరచడంలో మహేష్ కుమార్ గౌడ్ అనుభవమున్న వ్యక్తి అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హన్మంతరావు తోపాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App