Governance Day : ఘనంగా జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

Telangana People’s Governance Day Celebrations

*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు

పెద్దపల్లి, సెప్టెంబర్-17: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు.

జిల్లా వేడుకలను పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ సమీపంలో గల పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజా పాలన వేడుకలు పాల్గొన్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజా పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలు ఉత్తర్వులను ఉద్యోగులు పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు.

జిల్లాలోని గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో కూడా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana People's Governance Day Celebrations

You cannot copy content of this page

Scroll to Top