TRINETHRAM NEWS

మైనార్టీ మేలుకోరేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పఠాన్ రాజేష్ వెల్లడి

బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో గురువారంబాపట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మౌజన్,ఇమామ్, కాజీ,లకు నెలకు దాదాపు 12 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశానని తెలిపారు. అదేవిధంగా నాలుగువేల కోట్ల బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం అని ఆయన పేర్కొన్నారు. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలను ఎంతో గౌరవిస్తూ మైనారిటీలను అందరితో సరి సమానంగా చూస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వంలో మైనారిటీలను నిట్ట నిలువ ముంచారని ఆయన మండిపడ్డారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ముస్లిం సోదర సోదరీమణులకు షాదీ తోఫా కింద 50 వేల రూపాయలు ఇస్తుంటే ముస్లింలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి లక్ష రూపాయలు ఇవ్వకపోగా ఆ 50 వేలను కూడా ఇవ్వకపోవడం ఎంతో సోచనీయమని ఆయన తెలియజేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు త్వరలోనే ఏర్పడాలని ఆయన కోరారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చూసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనే ఆయన తెలియజేశారు. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎదురుచూస్తున్నారని ఆయన తెలియజేశారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ని,రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయబోతున్నామని పఠాన్ రాజేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాజ్ హుద్ధిన్,నజీర్ హుసేన్, ఆమన్ ఉల్లా బేగ్, ముజీబుర్ రెహమాన్, జిలాని, బుజ్జి,కర్రిమూల్లా, నక్కల రాంబాబు తదితరులు పాల్గొన్నారు…