TRINETHRAM NEWS

Managers of Ganesh mandaps should follow the rules

రామగుండం పోలీస్ కమిషనరేట్

గణేశ్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజీ సూచించారు. మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రం లోని చింతపండు వాడ ఏరియా లోని సిద్ధి వినాయక మరియు 100 ఫీట్ రోడ్ లోని అంజనీ పుత్ర గణేశ్ మండపంతోపాటు మరి కొన్ని ప్రధాన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను ఆదివారం రాత్రి సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు పోలీసు శాఖ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాట్లును పరిశీలించారు. సమస్యలు ఉంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

అనంతరం నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన నిబంధనలు, ఆంక్షలు పాటించాలని, ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. అధికారులకు బందోబస్తు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, మండపం వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ బుక్ లను చెక్ చేయాలని పోలీసులకు సూచించారు

సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Managers of Ganesh mandaps should follow the rules