జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 02 at 11.39.01

TRINETHRAM NEWS

Prime Minister called Chandrababu, asked about the flood situation

Trinethram News : అమరావతి
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగి ప్రధాని మోడీ తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన ప్రధాని మోడీ తెలిపారు.

తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రాన్రికి అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆదేశాలు ఇచ్చామని వివరించారు. రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తామని మరోసారి ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర సహాయంపై ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prime Minister called Chandrababu, asked about the flood situation

You cannot copy content of this page