జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 27 at 4.50.29 PM

TRINETHRAM NEWS

Nara Lokesh : మా బాబే ఏపీకి సీఎం – లోకేష్..బ‌లంగా వాణి వినిపిస్తున్న కొడుకు

Nara Lokesh : అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

Nara Lokesh Comment
బుధ‌వారం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. గ‌త కొన్ని రోజులుగా జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి కాబోతున్నారంటూ వ‌స్తున్న ప్ర‌చారానికి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు. రాష్ట్రంలో క‌మ్మ సామాజిక ఓటు బ్యాంకు అత్య‌ధికంగా ఉంది. తమ‌కు అధికారం లేక పోయినా ఉండ‌గ‌ల‌రు కానీ, త‌మ పేరుతో అధికారంలోకి వ‌స్తే సీఎంగా ప‌వ‌న్ ను ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటూ బాహాటంగా ప్ర‌క‌టిస్తుండ‌డం చ‌ర్చ‌కు దారి తీసేలా చేస్తోంది.

త‌న తండ్రి చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని ప్ర‌క‌టించారు నారా లోకేష్(Nara Lokesh). అయితే త‌న కొడుకు ద్వారా ప‌రోక్షంగా బాబు చెప్పించార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. అయితే జ‌న‌సేన పార్టీ మాత్రం వేచి చూసే ధోర‌ణిని అవ‌లంభిస్తోంది.

ఇదిలా ఉండ‌గా ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. 175 సీట్ల‌కు గాను వై నాట్ 175 సీట్లు క్లీన్ స్వీప్ చేయాల‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ చీఫ్‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

You cannot copy content of this page